Credit Chori : ఐదేళ్లలో ఏం చేశారని జగన్‌కు క్రెడిట్ ఇవ్వాలి : మంత్రి గొట్టిపాటి

by Ramesh Naini |   (  Updated:2026-01-22 07:11:24  IST  )

గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు.

Credit Chori : ఐదేళ్లలో ఏం చేశారని జగన్‌కు క్రెడిట్ ఇవ్వాలి : మంత్రి గొట్టిపాటి
X

దిశ, డైనమిక్ బ్యూరో : గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జగన్ తన పాలనపై క్రెడిట్ కోరుకోవడాన్ని తప్పుపడుతూ.. ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపినందుకే ఆయనకు ఆ క్రెడిట్ ఇవ్వాలని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, సామాన్య ప్రజలపై సుమారు రూ. 30 వేల కోట్ల అదనపు భారాన్ని వేసినందుకు జగన్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలన్నారు.

క్రెడిట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం

క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, పీపీఏలను (PPA) రద్దు చేసి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయన చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. జగన్ గనుక మరోసారి అధికారంలో ఉండి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని విధంగా అప్పుల కుప్పగా మారిపోయేదని, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న వ్యక్తి, ఇప్పుడు 'క్రెడిట్ చోరీ' గురించి మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘మళ్లీ ఏ మొహం పెట్టుకుని 'జగన్ ఉండి ఉంటే' అని మాట్లాడుతున్నావు?’ అంటూ గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో జగన్ చూపించిన చొరవను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఆయన స్పష్టం చేశారు.

Read More..

Credit Chori : భూ సర్వే క్రెడిట్‌ చోరీ.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

Next Story