Pawan: సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే..

by Disha Web Desk 16 |
Pawan: సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం అంబేద్కర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయడాన్ని సభలో ప్రస్తావించారు. ఇప్పటి వరకూ బటన్ నొక్కి సంబరం చేసుకున్నారని, సీఎం జగన్ నొక్కని బటన్లను చెబుతానంటూ పవన్ వ్యాఖ్యానించారు. ‘పూర్తి కాని పోలవరం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, మత్య్సకారుల దీనస్థితి, అభివృద్ధికి నోచుకోని ఏపీ, అప్పుల ఆంధ్రప్రదేశ్, మూతపడ్డ 8 వేల స్కూళ్లు, తాగునీరు అందని గ్రామాలు’ వంటివి సీఎం జగన్ నొక్కని బటన్లు అని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని, తనను నమ్మితే ప్రజల వెంటే ఉన్నానని పవన్ హామీ ఇచ్చారు. బలమైన పాలకులతోనే ఏపీ నెంబర్ 1 అవుతుందని, జనం బాగుపడాలంటే సీఎం జగన్ పోవాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

ఇవి కూడా చదవండి :

రక్తం పీల్చేస్తున్నారు.. బతికుంటానో లేదో తెలియదు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed