విద్యార్థినికి న్యాయం చేస్తాం.. ఎవరినీ వదిలిపెట్టం: హోంమంత్రి వంగలపూడి అనిత

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-08 09:34:34  IST  )

తిరుపతి (Tirupati) జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై ఇద్దరు ప్రొఫెసర్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

విద్యార్థినికి న్యాయం చేస్తాం.. ఎవరినీ వదిలిపెట్టం: హోంమంత్రి వంగలపూడి అనిత
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati) జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై ఇద్దరు ప్రొఫెసర్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితురాలు గర్భం దాల్చగా బెదిరించి ఆమెను సొంత రాష్ట్రానికి పంపించారు. ఇంఛార్జ్ వీసీ రజనీకాంత్ ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను తిరుపతి వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కేసులో పూర్తి ఆధారాలను రికవరీ చేసేందుకు ఇద్దరి సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధిత విద్యార్థినికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితులను ఉపేక్షించేది లేదన్నారు. తిరుపతి ఎస్పీ, పోలీసు, ఉన్నతాధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నానని అన్నారు. ఈ కేసును తిరుపతి ఎస్పీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని, పూర్తి స్థాయి విచారణ కోసం ఒడిశాకు పోలీసుల బృందం వెళ్లిందన్నారు. విద్యార్థినికి న్యాయం చేస్తామని.. మహిళల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత అన్నారు.

Read More... దళిత విద్యార్థినిపై జరిగిన అవమానకర ఘటనపై లోక్ సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ

బతికుండగానే తండ్రికి విగ్రహం.. కేటీఆర్ ను ఏకి పారేస్తున్న నెటిజన్స్

Next Story