బతికుండగానే తండ్రికి విగ్రహం.. కేటీఆర్ ను ఏకి పారేస్తున్న నెటిజన్స్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా IYKYK ( If You Know, You Know ) అంటూ కేసీఆర్ AI ఫోటో పోస్ట్ చేశారు.

బతికుండగానే తండ్రికి విగ్రహం.. కేటీఆర్ ను ఏకి పారేస్తున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా IYKYK ( If You Know, You Know ) అంటూ కేసీఆర్ AI ఫోటో పోస్ట్ చేశారు. కాగా నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ ఫోటోపై ఓవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు నెటిజన్స్ కేటీఆర్ ను కడిగి పారేసారు. బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టడం ఏంటని నెటిజన్స్ మండిపడ్డారు. కాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. "బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు" అంటూ రాసుకొచ్చింది.

మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ విగ్రహం వద్ద ఉన్న కుక్కను చూపి.. కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా..? అంటూ కామెంట్లుచేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ AI విగ్రహం సోషల్ మీడియాలోని ఇరు పార్టీల మధ్య మరోసారి రాజకీయ వేడి పెంచింది.

Next Story