Anakapalli: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-19 15:58:36  IST  )

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శృంగవరపు కోట నుంచి అనకాపల్లి వెళ్తూ మార్గమధ్యంలో సరిపల్లి వద్ద ఆగి టీ దుకాణం వద్ద టీ తాగారు..

Anakapalli: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన
X

దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. శృంగవరపు కోట నుంచి అనకాపల్లి వెళ్తూ మార్గమధ్యంలో సరిపల్లి వద్ద చంద్రబాబు ఆగి టీ దుకాణం వద్ద టీ తాగారు. అలాగే టీ దుకాణ యజమానురాలు కలికి శివమ్మతో కొద్దిసేపు మాట్లాడారు. టీ దుకాణంతో పూట గడవడం కష్టంగా మారిందన్న శివమ్మ చంద్రబాబుకు తెలియచేసింది. తమకు ఇళ్ళు లేదని, పిల్లల్ని చదివించే ఆర్థిక స్తోమత లేదంటూ చంద్రబాబుకు తమ బాధలు చెప్పుకుంది. పిల్లల్ని చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు మాటిచ్చారు. అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Read more:

Breaking: రూ.2 వేల నోట్ల రద్దుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Next Story