- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీటుగా జవాబిస్తాం.. మహానాడు వేదికగా ఉగ్రవాదులకు కేంద్రమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సింధూర్ ముగియలేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సింధూర్(Oparation Sindoor) ఇంకా ముగియలేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Rammohan Naidu) అన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ(Tdp) మహానాడు(Mahanadu)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం దాడి(Pahalgam Attack), ఆపరేషన్ సింధూర్‌ను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, ఉగ్రవాదులు, మద్దతు ఇచ్చే దేశాలు గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఎదుటే భారతీయులను ఉగ్ర వాదులు కాల్చి చంపారని, ఆ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ దాడులకు దిగితే మరింత గట్టిగా తిప్పికొడతామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్టీఏ కూటమి పాలన సాగుతోందని చెప్పారు.
రాష్ట్రానికి ఎప్పటికప్పుడు సహకరిస్తూనే ఉందని తెలిపారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి సమస్యను సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామన్నారు. తెలుగువాళ్ల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, మూల సిద్ధాంతాలపై వెనకడుగు వేయడం లేదన్నారు. టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి మొదలయ్యాయని చెప్పారు. సంస్కరణలకు టీడీపీ నాంది పలికిందని పేర్కొన్నారు. పీపీఏ విధానంతో ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చంద్రబాబు తీసుకొచ్చారని, పాపులేషన్ మేనేజ్‌మెంట్ విధానానికి శ్రీకారం చుడుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Also Read..






