- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ చెందిన ఇద్దరు డీఎస్పీ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (road accident)లో ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ చెందిన ఇద్దరు డీఎస్పీ అధికారులు (DSP officials) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే అడిషనల్ ఎస్పీ, డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ విషాద ఘటనతో ఏపీ పోలీస్ శాఖలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), హోంమంత్రి అనిత వెంటనే స్పందించారు.
ఈ సందర్భంగా సీఎ చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. సంతాపం (condolence) తెలిపారు. సీఎం తన ట్వీట్లో "యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పని చేస్తున్న ఇద్దరు డిఎస్పీలు చక్రధరరావు, శాంతారావు మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను." అని రాసుకొచ్చారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Read More: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం.. హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి






