- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ సమయంలో వారికి అండగా నిలిచాను’.. టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh)లో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రాంత రైతుల వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రాంత రైతుల వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని టీటీడీ ఛైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) పేర్కొన్నారు. రైతుబిడ్డగా రైతులకు అండగా నిలిచానని.. కేసులు పెట్టినా వెనకడుగు వేయలేదని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ క్రమంలో నేడు(గురువారం) వెలగపూడిలో రాజధాని రైతుల ఐకాస ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) సూచనల మేరకు రాజధాని రైతులతో సమావేశమయ్యానని తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరంలో పాదయాత్రలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అమరావతి(Amarawati) లాంటి ఉద్యమం ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజధాని రైతులు, మహిళల కన్నీటిలో వైఎస్‌ఆర్‌సీపీ కొట్టుకుపోయిందని అన్నారు. ఉద్యమం విజయవంతం అయినందుకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 15వ తేదీన జరిగే శ్రీనివాస కళ్యాణంలో రైతులంతా పాల్గొనాలని టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.
Read Also..
నన్ను ప్రపంచ బ్యాంక్ జీతగాడని అన్నారు.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్






