Breaking:టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-07 09:34:16  IST  )

టీడీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Breaking:టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు(శనివారం) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పై టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1994లో విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా సింహాచలం నియోజకవర్గ అభివృద్ధి ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తండ్రి, పార్టీ సీనియర్ నేత పల్లా సింహాచలం మృతి పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సింహాచలం మృతికి సీఎం సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా 1994లో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి సింహాచలం కృషి చేశారని కొనియాడారు. పల్లా కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More..

మాజీ ఎమ్మెల్యే మృతి పై మంత్రి లోకేష్ సంతాపం


Next Story