మాజీ ఎమ్మెల్యే మృతి పై మంత్రి లోకేష్ సంతాపం

by Jakkula.Mamatha |

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మేల్యే పల్లా సింహాచలం ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు.

మాజీ ఎమ్మెల్యే మృతి పై మంత్రి లోకేష్ సంతాపం
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మేల్యే పల్లా సింహాచలం ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే(Former MLA) పల్లా సింహాచలం(Palla Simhachalam) గారి మృతి పట్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ క్రమంలో ‘‘1989 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలందించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. పల్లా సింహాచలం సౌమ్యుడిగా పేరుగాంచారు. శాసనసభ్యుడిగా ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పల్లా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Next Story