- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా దొరకని పెద్దపూలి జాడ.. 6 గ్రామాల ప్రజలకు హెచ్చరిక
తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది పెద్దపులి. అటవీశాఖ అధికారులు, పోలీసులు రెండ్రోజులుగా దానికోసం వెతుకున్నా.. ఇంకా ఆచూకీ తెలియలేదు.

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది పెద్దపులి. అటవీశాఖ అధికారులు, పోలీసులు రెండ్రోజులుగా దానికోసం వెతుకున్నా.. ఇంకా ఆచూకీ తెలియలేదు. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం, మండపేట మండలం కేశవరం మధ్య ఉన్న కొండపై పెద్దపులి ఉన్నట్లుగా సమాచారం అందడంతో.. అధికారులు థర్మల్ డ్రోన్ కెమెరాలతో పులి జాడ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అది కూడా విఫలమైంది. పెద్దపులి ఎక్కడుందో స్పష్టంగా గుర్తించాకే ట్రాంక్విలైజర్ వాడగలమని అధికారులు చెప్తున్నారు. స్థానికులెవరూ దానిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు పూణే నుంచి రెస్క్యూ టీమ్ వచ్చిందని తెలిపారు. పులిని జాగ్రత్తగా బంధించేందుకు అధికారులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
క్వారీలు, గుట్టలు, పొదలు ఎక్కువగా ఉండటంతో.. ఆహారం కోసం పులి మాటు వేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కేశవరం, జి.ఎర్రంపాలెం, ద్వారపూడి, పాతతుంగపాడు, కొత్త తుంగపాడు, పుణ్యక్షేత్రం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే పులి జాడ కోసం అధికారులు వెతకడం ప్రారంభించారు. ఫిబ్రవర 3న రాజమండ్రిలోని తొర్రేడులో పెద్దపులి రోడ్డుపై కనిపించడంలో వాహనదారులు హడలిపోయారు. దివాన్ చెరువు హైవే సమీపంలో పెద్దపులిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటి ముందు తచ్చాడిన పులి.. ఎటు వెళ్లాలో తెలియక చివరి ఓ కంచెను దూకి కొండల్లోకి వెళ్లినట్లుగా వాహనదారులు తెలిపారు.






