- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి
మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మడావి హిడ్మా మరణించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ - ఒడిశా బార్డర్ లోని మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీ, టాప్ కమాండర్ మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ, అనుచరులు చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్ మృతి చెందినట్లు తెలిపారు. మద్వి హిడ్మాపై రూ. కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షలు రివార్డు ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) ప్లాటూన్-1 కమాండర్ గా, కేంద్రకమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్ అటవీప్రాంతంలో ఉండే హిడ్మా.. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మారేడుమిల్లి అటవీప్రాంతంలోకి ఆశ్రయం కోసం వచ్చి పోలీసుల కాల్పుల్లో మరణించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మద్వి హిడ్మా 26 దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. 2007లో సుక్మా జిల్లా ఉర్పల్ మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిచేసి హతమార్చారు. 2010లో తడ్మెట్ల మెరుపుదాడిలో 76మంది జవాన్లు మరణించారు. 2013 జీరామ్ ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత చేసిన ఘటనలో హిడ్మానే కీలకపాత్ర పోషించారు. 2017 ఏప్రిల్‌లో సుక్మాజిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చారు. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా పన్నిన వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మరణించారు.
Read More... ఢిల్లీలో మరోసారి హై అలర్ట్.. కోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు
విజయవాడలో మావోయిస్టుల కలకలం.. బిల్డింగ్‌లో 10 మంది మావోయిస్టులు
ఏపీలో భారీ ఎన్కౌంటర్.. పెరిగిన మావోయిస్టుల కదలికలు! పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్






