ఢిల్లీలో మరోసారి హై అలర్ట్.. కోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-18 07:11:30  IST  )

ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనతో.. ఏ క్షణం ఎక్కడేం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

ఢిల్లీలో మరోసారి హై అలర్ట్.. కోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనతో.. ఏ క్షణం ఎక్కడేం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు జిల్లాకోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. నాలుగు కోర్టులు, రెండు సీఆర్పీఎఫ్ స్కూళ్లను పేల్చివేస్తామంటూ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాకేత్, రోహిణి, ద్వారక, పటియాలా కోర్టులను పేల్చివేస్తామని దుండగులు ఈమెయిల్ ద్వారా హెచ్చరించడంతో.. ఆయా కోర్టుల్ని ఖాళీ చేయించారు. లాయర్లు, క్లైంట్లను బయటకు పంపి, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ స్కూళ్లలోనూ విద్యార్థుల్ని అప్రమత్తం చేశారు. ఎవరూ కంగారుపడవద్దని పోలీసులు ధైర్యం చెప్పి, తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న విషయం తెలుసుకునే పనిలోనూ ఢిల్లీ పోలీసులు నిమగ్నమయ్యారు.

Read More... విజయవాడలో మావోయిస్టుల కలకలం.. బిల్డింగ్‍లో 10 మంది మావోయిస్టులు

Next Story