- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు అధికారులకు బెదిరింపులు.. మాజీ మంత్రిపై పేర్ని నానిపై కేసు నమోదు
కృష్ణా జిల్లా చిలకలపూడిలో వైసీపీ కీలన నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చిక్కుల్లో పడ్డారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని తీవ్రస్థాయిలో హెచ్చరించినందుకు గాను కృష్ణా జిల్లా చిలకలపూడి (Chilakalapudi) పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మచిలీపట్నం (Machilipatnam)లోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక ఇంటిని అధికారులు నిన్న కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరవర్గంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకోవడమే కాకుండా, అక్కడున్న ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగారు.
పోలీసుల యాక్షన్..
బాధ్యత గత ప్రజాప్రతినిధిగా ఉండి అధికారులపై దురుసుగా ప్రవర్తించడంపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన చిలకలపూడి పోలీసులు, పేర్ని నానిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






