- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులు ఏకవచనంతో దూషించలేదా? : మరోసారి పేర్నినాని ఫైర్
పోలీసులు తమపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నది నిజం కాదా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మరోసారి అధికారుల తీరుపై ఫైరయ్యారు. టౌన్ లోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఒక ఇంటిని నిన్న అధికారులు కూల్చివేయడంతో చిచ్చు రేగింది. దీంతో పేర్నినాని, తనయుడు పేర్ని కిట్టు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులపై అభ్యంతరకర పదజాలంతో మాట్లాడటంతో ఇనుగుదురుపేట సీఐ పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పేర్ని కిట్టుపై BNS 132, 351 (2), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదైంది.
తమపై కేసులు నమోదు చేయడంపై పేర్ని నాని స్పందించారు. పోలీసులు తమను ఏకవచనంతో దూషించలేదా? అని మీడియా ముఖంగా ఫైరయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఒక సీఐకు పోస్టింగ్ ఇచ్చారని, జాయిన్ అవ్వగానే ఖాళీ ఎందుకు చేయించారని ప్రశ్నించారు. కొల్లురవీంద్ర మంత్రికాగానే 2014లో ఒక సీఐను మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే జాయిన్ అవ్వడానికి వీల్లేదని ఎస్పీతో ఫోన్ చేయించలేదా? నిలదీశారు. తప్పుడు నాయకులు ఉన్నట్లే.. తప్పుడు అధికారులు కూడా ఉన్నారని విమర్శించారు.
ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించడమే తన ఉద్యోగమని, తనపై కేసులు పెట్టి జైలుకి పంపినా.. ఇలాగే ప్రశ్నిస్తానన్నారు. తప్పు చేసిన అధికారిని నిలదీస్తే అందరినీ అన్నట్లేనా? అని అడిగారు. అధికారులంతా జైపాల్ లాంటివారే ఉండరన్నారు. జిల్లాలో ఉన్న 4 వేల మంది అధికారుల్లో 3 వేలమంది నిజాయితీపరులే అని, నిఖార్సైన పోలీసుల్ని తాము బెదిరించలేదన్నారు. నిన్న జరిగిన గొడవలో పోలీసులు తమతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినందు వల్లే రియాక్టయ్యామన్నారు.






