మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవదహనం.. మృతుల వివరాలు ఇవే..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-26 09:33:38  IST  )

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొని మొత్తం 13 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ..

మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవదహనం.. మృతుల వివరాలు ఇవే..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం (Markapuram) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Bus), టిప్పర్ లారీ (Tipper lorry) ఢీకొని మొత్తం 13 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరో 28 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేక లోపలే వారంతా కాలిబూడిదయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. పెదారికట్లకు చెందిన అంబటి అనిల్‌తో పాటు 5 నెలల పసికందు అంబటి లియో కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే చల్లగిరిగలకు చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, తింగారెడ్డిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి, బత్తుల పద్మ ఈ దుర్ఘటనలో మరణించినట్లు అధికారులు గుర్తించారు.

మిగిలిన మృతుల్లో దాసరిపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు, ఉన్నగురువాయపాలెం వాసులు నర్సింగ్ ప్రభావతి, నర్సింగ్ క్షేత్ర ఉన్నారు. వీరితో పాటు పనుగోడుకు చెందిన దేవాండ్ల రామయ్య, మంగళకట్టకు చెందిన జయరామయ్య కూడా అగ్నిప్రమాదానికి బలయ్యారు. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?

మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

Next Story