రాజ్యసభలో అమరావతి బిల్లు.. తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి వాగ్వాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 12:04:48  IST  )

అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది...

రాజ్యసభలో అమరావతి బిల్లు.. తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లు(Amaravati Legalization Bill)పై రాజసభ(Rajyasabha)లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి(Telangana MPs Suresh Reddy and Kishan Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. విభజన తీరుపై బీజేపీ(Bjp) తరచుగా విమర్శలు చేస్తోందని సురేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిని చంపి బిడ్డను తీశారన్నారని తెలిపారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన సమయం ఇది అని సురేశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాలు వేరైనప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉందామని కేసీఆర్ సైతం చెప్పారని సురేశ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి కేసీఆర్ మద్దతు తెలిపారని చెప్పారు. దేశంలోనే తెలంగాణ(Telangana)ను కేసీఆర్(Kcr) నెంబర్ వన్‌గా నిలబెట్టారన్నారు. తెలంగాణ మండలాలను ఏపీ(Ap)లో విలీనం చేస్తూ కనీసం చర్చ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించామని సురేశ్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. 2 రాష్ట్రాలను కేంద్రం సమంగా చూడాలని రాజ్యసభలో సురేశ్ రెడ్డి సూచించారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు కూలితే ప్రాజెక్టు పనికి రాదంటున్నారని సురేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

అయితే ఇందుకు ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Mp, Uninon Minister Kishan Reddy) స్పందించారు. సురేశ్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని రిపోర్టులు వచ్చాయన్నారు. నిపుణులు, కాగ్ రిపోర్లుల్లోనూ అదే ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) పదే పదే చెప్పిందన్న విషయాన్ని గుర్తు చేసిన కిషన్ రెడ్డి... తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఏటీఎంలా పని చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో రాజ్యసభలో సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపు గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యం చేసుకుని గందరగోళాన్ని సర్దుమనిగించారు.

లోక్‌సభలో చామల వర్సెస్ కిషన్ రెడ్డి: మూసీ నిధులపై ఎంపీ క్లారిటీ!

Next Story