లోక్‌సభలో చామల వర్సెస్ కిషన్ రెడ్డి: మూసీ నిధులపై ఎంపీ క్లారిటీ!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-02 12:03:48  IST  )

లోక్‌సభ వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు.

లోక్‌సభలో చామల వర్సెస్ కిషన్ రెడ్డి: మూసీ నిధులపై ఎంపీ క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటుగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధి, అప్పులు మరియు మూసీ పునరుజ్జీవంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తూర్పారబట్టారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చామల స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుండి 500 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి ప్రిలిమినరీ ప్రపోజల్ రిపోర్టును (PPR) ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ నివేదికను కేంద్ర సంబంధిత శాఖా మంత్రికి, నీతి ఆయోగ్‌కు సమర్పించామని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి సహకరించాలని కోరారు.

బీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలు..

రాష్ట్ర అప్పులపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చామల ఘాటుగా సమాధానమిచ్చారు. "గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేసి దోచుకున్నారు. మరి ఆ పదేళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దోపిడీ జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?" అని చామల నిలదీశారు. బీఆర్ఎస్ దోచుకుంటున్నప్పుడు చూస్తూ ఊరుకున్న బీజేపీ, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటం సరికాదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉండాలని ఆయన కోరారు. మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజనల్ రింగ్ రోడ్డు (RRR) వంటి కీలక ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర మంత్రులు, ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాజ్యసభలో అమరావతి బిల్లు.. తెలంగాణ ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి వాగ్వాదం

Next Story