జన్మనిచ్చిన అమ్మే.. పునర్జన్మనూ ఇచ్చింది..! కొడుకు ప్రాణాలు కాపాడి మంటల్లో కాలిపోయిన తల్లి

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 09:15:58  IST  )

మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొడుకు ప్రాణాలను కాపాడి ఓ తల్లి అగ్నికీలలకు ఆహుతైపోయింది.

జన్మనిచ్చిన అమ్మే.. పునర్జన్మనూ ఇచ్చింది..! కొడుకు ప్రాణాలు కాపాడి మంటల్లో కాలిపోయిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం (Markapuram) సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఓ తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి కొడుకును కాపాడిన ఘటన ప్రతిఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. మంటలు వ్యాపిస్తున్న క్రమంలో తన కొడుకును బస్సు బయటకు తోసేసి సురక్షితంగా కాపాడిన ఆమె, తాను మాత్రం బస్సులోనే చిక్కుకుని సజీవదహనమైన ఘటన అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కనిగిరి మండలం మందాడివారిపల్లి (Mandadivaripalli)కి చెందిన ఉప్పు రమాదేవి (45) తన కుమారుడు మనోహర్‌ (Manohar)తో కలిసి బస్సులో స్వగ్రామానికి ప్రయాణిస్తున్నారు. మార్కాపురం సమీపంలో బస్సు ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టాయి. అయితే, అందరికంటే ముందే బస్సులో మంటలను గమనించిన రమాదేవి, ప్రమాదం తీవ్రతను ముందే ఊహించి తన కొడుకు మనోహర్‌ను వెంటనే బస్సు కిటికీ నుంచి బలవంతంగా బయటకు తోసేసింది. దీంతో మనోహర్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ, అప్పటికే మంటలు తీవ్రమవ్వడం, పొగ అలుముకోవడంతో రమాదేవి బయటకు రాలేకపోయింది. బయటపడ్డ కుమారుడు తన తల్లిని కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ, మంటల ఉధృతికి ఎవరూ లోపలికి వెళ్లలేకపోయారు. కన్న కొడుకు కళ్లెదుటే రమాదేవి బస్సులో చిక్కుకుని మంటల్లో కాలి బూడిదైంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?

మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

Next Story