- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ నెయ్యి వ్యవహారంపై సంచలనం.. ఏకసభ్య కమిటీ వేస్తూ ప్రభుత్వం ఆదేశం
కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ వేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం(Tirumala Laddu adulterated Ghee )పై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిటీ(Single-member committee) వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కోర్టుకు సిట్ ఇచ్చిన నివేదిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అమరావతి సచివాలయంలో కూటమి అధినేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని స్పష్టం చేసింది. జగన్ తప్పులు చేసి, కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారని, దుర్మార్గాలు చేసి, తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మంండిపడ్డారు. శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగి ఉండొచ్చు: వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు






