తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగి ఉండొచ్చు: వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-05 10:43:45  IST  )

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు..

తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగి ఉండొచ్చు: వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి(Tirumala Laddu adulterated Ghee) వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ చెప్పిందని, చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. తాను తప్పు చేసి సీఎఫ్టీఆర్ఐకి శాంపిల్స్ ఎందుకు పంపుతామని ప్రశ్నించారు. తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ ఎందుకు కోరతామని నిలదీశారు. టీడీపీ హయాంలోనూ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని గుర్తు చేశారు. తిరుమల శ్రీనివాసులు విషయంలో రాజకీయాలు చేయకూడదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ తేల్చిందని చెప్పారు. కల్తీ జరిగి ఉండొచ్చుగాని, జంతువుల కొవ్వు కలవలేదన్నారు. తిరుమల భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బతీశారని ఆరోపించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారంపై సీఎం రాజకీయం చేశారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై సంచలనం.. ఏకసభ్య కమిటీ వేస్తూ ప్రభుత్వం ఆదేశం

Next Story