- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కష్ట కాలంలో ఇచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుంది : మంత్రి లోకేశ్
కష్టకాలంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరం (Rajamahendra Varam) ప్రజలు తమకు ఇచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుందని రాష్ట ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కష్ట కాలంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరం (Rajamahendra Varam) ప్రజలు తమకు ఇచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుందని రాష్ట ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన శుక్రవారం పర్యటించారు. రాజమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. బూరుగుపూడి జంక్షన్ వద్ద రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గాడాల గ్రామంలో, లాలాచెరువు జంక్షన్ వద్ద, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, మంత్రి లోకేష్‌కు గోదావరి జిల్లాల శైలి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతిభ కళాశాల వద్ద మంత్రి లోకేశ్ విద్యార్థులతో సెల్ఫీలను దిగారు. తద్వారా తాను వారిలో ఒకడినే అనే భావనను విద్యార్థులకు కల్పించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ చేశారు మంత్రి లోకేశ్. గోదావరి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, వారి పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. గోదావరి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తూర్పు గోదావరి జిల్లా ప్రజలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారన్నారు. వారు చూపించే మమకారం, వెటకారం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. అక్కడ ఎప్పుడు పర్యటించినా సొంత ఊరికి వెళ్లిన అనుభూతి కలుగుతుందని భావోద్వేగానికి గురయ్యారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లిన తనకు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారన్నారు. వారు చూపించిన ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలను తెలియజేశారు.
READ MORE ....
తనపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్‌పై స్పందించిన నారా లోకేష్






