తనపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్‌పై స్పందించిన నారా లోకేష్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-19 11:00:32  IST  )

తనపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్‌పై స్పందించిన నారా లోకేష్

తనపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్‌పై స్పందించిన నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా‌లోని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ(Rajahmundry Arts College) విద్యార్థులతో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత, చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తనను ఎంతోమంది ట్రోల్స్ చేశారని.. సోషల్ మీడియా వేదికగా తనపై మీమ్స్ కూడా వైరల్ చేశారని గుర్తుచేశారు. కానీ నేను ఏదీ పట్టించుకోకుండా.. ముందుకు వెళ్లాను. టీడీపీకి అత్యంత కఠినంగా మారిన మంగళగిరి నుంచి స్వయంగా తానే ఓడినా కూడా.. మళ్లీ అక్కడినుంచే పోటీ చేసి గెలిచాను.

పరిస్థితులకు ఎప్పుడూ తలవంచొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులను అయినా మనకు అనుకూలంగా మార్చుకోవాలని అన్నారు. ఒక్కసారి భయంతో వెనకడుగు వేస్తే.. మళ్లీ ముందడుగు వేయడానికి చాలా ఏళ్లు పడుతుందని చెప్పారు. ఇంట్లో అమ్మా, నాన్నకు చెప్పకుండా.. ముఖ్యంగా అమ్మకు చెప్పకుండా ఏ పని కూడా చేయొద్దని అన్నారు. కగా, ఇటీవలే యువగళం పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీని లోకేష్ నెరవేర్చారు. ప్రతి ఏటా అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ ఎన్‌వోసీ తీసుకోవాలనే నియమాన్ని తొలగించారు. రాష్ట్రంలో 30 మీటర్ల ఎత్తు వరకు భవానాలున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ఐదేళ్లకోకసారి ఫైర్ ఎన్‌వోసీ రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధనను కూటమి ప్రభుత్వం సడలించింది.

READ MORE ....

కష్ట కాలంలో ఇచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుంది : మంత్రి లోకేశ్

Next Story