మహిళతో ఎస్సై అసభ్య ప్రవర్తన.. కాల్​ చేసి ఏమ్మన్నాడంటే..

by Thanuru Gopichand |   (  Updated:2025-08-13 13:21:35  IST  )

ఏపీలోని ధర్మవరం నియోజకవర్గం పట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ అసభ్య ప్రవర్తన కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు.

మహిళతో ఎస్సై అసభ్య ప్రవర్తన.. కాల్​ చేసి ఏమ్మన్నాడంటే..
X

దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలోని ధర్మవరం నియోజకవర్గం పట్నం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ అసభ్య ప్రవర్తన కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్నాడు. రెండు నెలల క్రితం తన బంధువుల విడాకుల విషయంలో పీఎస్‌కు వెళ్లిన మహిళతో ఎస్సై రాజశేఖర్ పరిచయం పెంచుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఆమెకు తరచూ వీడియో కాల్స్ చేసి వేధించసాగాడు. వీడి యో కాల్‌లో మహిళతో అసభ్యంగా మాట్లాడటమే కాకుండా, బట్టలు విప్పి చూపించి ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ భర్త ఎస్సై రాజశేఖర్‌ను హెచ్చరించినా అతని తీరులో మార్పు రాలేదు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం బట్టబయలైంది.

Read More..

లూసియానాలో దారుణం.. బ్రెస్ట్ మిల్క్ తాగనివ్వలేదని.. క్లోజ్‌ ఫ్రెండ్‌పై అత్యాచారం..

Next Story