లూసియానాలో దారుణం.. బ్రెస్ట్ మిల్క్ తాగనివ్వలేదని.. క్లోజ్‌ ఫ్రెండ్‌పై అత్యాచారం..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-13 13:22:41  IST  )

అమెరికా లూసియానాలో దారుణం చోటు చేసుకుంది. బ్రెస్ట్ మిల్క్ తాగనివ్వలేదని.. ఫ్రెండ్‌పై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. వెస్ట్ మన్రోకు చెందిన సెసిల్ హీత్ పుల్లర్.. రెండు వారాల క్రితం డెలివరీ అయిన స్నేహితురాలి దగ్గరకు వెళ్లాడు. తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి వాకబు చేసిన అతను..

లూసియానాలో దారుణం.. బ్రెస్ట్ మిల్క్ తాగనివ్వలేదని.. క్లోజ్‌ ఫ్రెండ్‌పై అత్యాచారం..
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా లూసియానాలో దారుణం చోటు చేసుకుంది. బ్రెస్ట్ మిల్క్ తాగనివ్వలేదని.. ఫ్రెండ్‌పై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. వెస్ట్ మన్రోకు చెందిన సెసిల్ హీత్ పుల్లర్.. రెండు వారాల క్రితం డెలివరీ అయిన స్నేహితురాలి దగ్గరకు వెళ్లాడు. తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి వాకబు చేసిన అతను.. ఆ తర్వాత బ్రెస్ట్ మిల్క్ తాగొచ్చా అని అడిగాడు. ఇందుకు నిరాకరించిన ఆమె.. అక్కడ నుంచి లేచి బెడ్‌రూమ్‌‌లోకి వెళ్లిపోగా.. ఆమెను అనుకరిస్తూ వెళ్లి ఫోర్స్ చేశాడు. వ్యతిరేకించేసరికి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశాడు. ఆ టైంలో శిశువు ఏడవడంతో దాడి ఆపినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన ఆగస్టు 5న జరగ్గా.. అదే రోజు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెస్ట్ మన్రో పోలీస్ శాఖ.. తనను గ్లెన్‌వుడ్ రీజనల్ మెడికల్ సెంటర్‌లో విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ పొందిన వారు పుల్లర్‌ను అదేరోజు అదుపులోకి తీసుకున్నారు. కాగా భార్యతో విడిపోయిన పుల్లర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. డ్రగ్స్ కేసులో చాలా సార్లు పట్టుబడ్డాడని తెలుస్తోంది.

Read More..

85ఏళ్ల వృద్ధుడి రాసలీలలు.. ఒక్క రాత్రికి రూ.12లక్షలు.. ఐదుగురితో ఒకేసారి..

మహిళతో ఎస్సై అసభ్య ప్రవర్తన.. కాల్​ చేసి ఏమ్మన్నాడంటే..

Next Story