వచ్చే ఎన్నికల బరిలో దిగనున్న Hyper Aadi

by Phanindra |   (  Updated:2023-01-17 06:14:25  IST  )

హైపర్ ఆది వచ్చే ఎన్నికల బరిలో దిగనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

వచ్చే ఎన్నికల బరిలో దిగనున్న Hyper Aadi
X

దిశ, వెబ్ డెస్క్ : హైపర్ ఆది వచ్చే ఎన్నికల బరిలో దిగనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ లో ఎలాంటి పంచులు వేస్తాడో మన అందరికి తెలుసు. గత కొద్దీ కాలం నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారని కూడా పలు రకాల వార్తలు కూడా వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతిచ్చారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల కోసం సన్నిహితులతో కలసి ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌ ను విమర్శించే వారందరిపై గట్టిగా సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయం రంగంలోకి దిగనున్నారని తెలిసిన సమాచారం. గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

Read more:

జనసేన, బీజేపీతో టీడీపీ జత కడితే... ఏపీలో జరిగిదే ఇదే!

Ap Politics: ఎత్తుల వ్యూహం... పొత్తుల సంకేతం!

Next Story