హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ‘‘Historic Amaravati Resolution’’

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-28 12:48:57  IST  )

సోషల్ మీడియా వేదికగా #HistoricAmaravatiResolution హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది...

హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ‘‘Historic Amaravati Resolution’’
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా #HistoricAmaravatiResolution హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.

ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల..

ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటూ, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ పోస్టులు చేస్తున్నారు. రాజధాని విషయంలో నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి ఈ తీర్మానంతో తెరపడిందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అభివర్ణిస్తున్నారు.

మళ్ళీ వెలుగులోకి అమరావతి...

రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు సైతం ఈ ట్రెండ్‌లో భాగస్వాములవుతున్నారు. అమరావతి మళ్ళీ వెలుగులోకి రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శుభసూచకమని పేర్కొంటున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది ఇంప్రెషన్లతో ఈ హ్యాష్ ట్యాగ్ దూసుకుపోతుండటం, ప్రజల్లో అమరావతి పట్ల ఉన్న ఆకాంక్షను స్పష్టం చేస్తోంది.

Amaravathi:అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

Next Story