Breaking: అంబటి రాంబాబుపై PT వారెంట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-08 10:56:18  IST  )

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాఖలైన పీటీ వారెంట్‌పై సోమవారం కోర్టు తీర్పు ఇవ్వనుంది..

Breaking: అంబటి రాంబాబుపై PT వారెంట్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Cm Chandrababu)ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదు అయింది. ప్రభుత్వ పీపీపీ విధానాన్ని నిరసిస్తూ నవంబర్ 12న చేపట్టిన ధర్నాలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లినందుకు మాజీ మంత్రి అంబటిపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌(Pattabhipuram Police Station)లో కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి అంబటిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు పీటీవారెంట్‌‌ను దాఖలు చేశారు. ఈ నెల 11న ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలని పీటీ వారెంట్‌లో పోలీసుల కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. ఈ మేరకు రాజమండ్రి జైలులో ఉన్న ఆయనను కోర్టుకు తీసుకురానున్నారు. మరోవైపు చంద్రబాబును దూషించిన కేసులో మరింత విచారణ చేపట్టేందుకు అంబటిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పైనా సోమవారం మొబైల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఏపీలో పీక్స్‌కు కుల రాజకీయాలు.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

Next Story