ఏపీలో పీక్స్‌కు కుల రాజకీయాలు.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-08 10:57:14  IST  )

కులం ఎంపిక కాదని, మనం నిర్ణయించుకోలేమని జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు..

ఏపీలో పీక్స్‌కు కుల రాజకీయాలు.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి మనిషి ఏదో ఒక కులంలో పుడతారు. పెరిగి పెద్దవుతాడు. ఇంటి పేరుతో సహా గోత్రం వంటి సంప్రదాయ పద్ధతులు సైతం కులం నుంచే వస్తాయి. అయితే పౌరుషం కూడా కులం నుంచే పుడుతుంది. కాకపోతే మేమే గొప్ప అన్న విధానం కొందరిలో మాత్రమే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కులం అనేది వెర్రితలలు వేస్తోంది. తమకు మించిన వాళ్లు లేరు అనేలా కొన్ని కులాల ఆధిపత్యం కొనసాగుతోంది. సినిమా, రాజకీయం పేరుతోనూ కులాల మధ్య కుంపట్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఓ ఘటన మరోసారి సంచలనంగా మారింది.

కోర్టుకు సిట్ నివేదిక

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇటీవల కోర్టుకు సిట్ నివేదిక అందజేసింది. అయితే ఈ నివేదికలో లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిందని, కానీ జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొంది. ఇప్పుడు ఈ రెండు అంశాలే ఏపీలో కులాల మధ్య రాజకీయ రగడకు దారి తీశాయి.

కొవ్వు కలవకపోయినా

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవకపోయినా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ మాత్రం సీఎం చంద్రబాబుపై రెచ్చిపోయి ఘాటు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పైనా విమర్శల వర్షం కురిపించారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడలు చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీ, కాపు కులంపై దాడి చేశారంటూ ప్రచారం చేశారు. కాపు కులానికి చెందిన అంబటి రాంబాబు, బీసీ వర్గానికి చెందిన జోగి రమేశ్ పై దాడికి కులాలపై ఉన్న చిన్నచూపుతోనేనంటూ ఆరోపించారు. పవన్ కల్యాణ్ అండ చూసుకునే టీడీపీ నేతలు అంబటి, జోగి రమేశ్ పై దాడి చేశారని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్‌కు గట్టిగా

ఈ వ్యాఖ్యలు కాపు కులానికి చెందిన పవన్ కల్యాణ్‌కు గట్టిగా తగిలాయి. కానీ ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. ఎక్కడా కులాల ప్రస్తావన లేకుండా ప్రసంగం చేశారు. కానీ కాపుకులానికి చెందిన కొంతమందిలో ఆందోళన మొదలైంది.నిజంగా కాపు కులంపై వివక్ష సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కాపు కులంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై పవన్ కల్యాణ్ స్పందించకపోయినా ఆయన తమ్ముడు, జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు.

పుట్టుకతో వచ్చే విషయం కాదు...

‘‘కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక కాదు.. మనం ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకోలేం కానీ, ఎలా బ్రతకాలో మాత్రం నిర్ణయించుకోగలం.. పెద్ద సంఖ్యలో ఉన్న కులాలు, చిన్న సంఖ్యలో ఉన్న కులాలను ప్రోత్సహిస్తే.. అభివృద్ధి ఆటోమేటిక్‌గా జరుగుతుంది.. అందుకే, పవన్ రాష్ట్రంలో ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు.’’ అని నాగబాబు సూచించారు. మరి నాగబాబు వ్యాఖ్యలను వైసీపీ నాయకులు, కాపు కులానికి చెందిన కొందరు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Breaking: అంబటి రాంబాబుపై PT వారెంట్

Next Story