- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థాంక్యూ సార్.. డిప్యూటీ సీఎంకు చిన్నారుల షేక్ హ్యాండ్
పిల్లలవి కల్మషం ఎరుగని మనసులు.

దిశ, వెబ్ డెస్క్ : గొల్లప్రోలులోని హౌజింగ్ కాలనీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మనసుకు హత్తుకునే ఓ సంఘటన జరిగింది. తన కాన్వాయ్ నుంచి డిప్యూటీ సీఎం కిందకు దిగి నూతనంగా సుద్దగడ్డ వాగుపై నిర్మించిన నూతన వంతెనను సందర్శిస్తున్నారు. వంతెన నిర్మాణమైన తీరు, పనుల్లో నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు చిన్నారులు తమ చేతుల్లో థాంక్యూ డిప్యూటీ సీఎం సార్ అని ప్లకార్డులను చేతబట్టుకొని ఆయన వైపు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. డిప్యూటీ సీఎంను కలవాలని ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్ దాటుకొని ఆయన్ను కలవడం అంటే మాటలు కాదు కదా.. కానీ ఆ చిన్నారుల ఆనందం కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. వారిని తన వద్దకు రప్పించుకున్నారు. స్వయంగా తమ అభిమాన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలవడంతో పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్లకార్డులో చేతుల్లోనే పట్టుకొని ఆయన వద్దకు పరుగున వచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పేందుకు పోటీపడ్డారు. వారి కంగారును గమనించిన డిప్యూటీ సీఎం ఒక్కొక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. తనకు పిల్లలంటే ఎంత అభిమానమో చాటుకున్నారు. ప్లకార్డును చేతిలోకి తీసుకొని చూస్తూ.. వెల్కం అంటూ చిన్నారులకు చెప్పారు. ఇరువురి మధ్యన ఆదరాభిమానాలను చూసినవారు అబ్బో పిల్లలకు భలే చాన్స్ దొరికిందిలే అనుకున్నారు. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడమంటే అభిమానాలకు అదొక పండగ మరీ!!
READ MORE .....
కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు : డిప్యూటీ సీఎం
నెలలో ఒక్కసారైనా వెళ్లండి: యువ వైద్యులకు పవన్ కల్యాణ్ కీలక రిక్వెస్ట్






