నెలలో ఒక్కసారైనా వెళ్లండి: యువ వైద్యులకు పవన్ కల్యాణ్ కీలక రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-10 11:10:45  IST  )

నెలకోసారి గిరిజన ప్రాంతాలకు వైద్యులు వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు..

నెలలో ఒక్కసారైనా వెళ్లండి:  యువ వైద్యులకు పవన్ కల్యాణ్ కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నెలకోసారి గిరిజన ప్రాంతాలకు వైద్యులు వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీ(Rangaraya Medical College) అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గన్న ఆయన గిరిజన ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న వైద్యులు నెలలో ఒకసారైనా గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అరకులో సికిల్‌సెల్ అనీమియా బాధితులకు బ్లడ్ బ్లాంక్ నిర్మిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పెద్ద పెద్ద చదువులు చదుకుని ఇంకా కులాలపైనే మాట్లాడుతున్నారని అసంతృప్తి చేశారు. కులానికో కలర్ ఉంటుందా అని ప్రశ్నించారు. తనకు సంకుచిత మనస్తత్వం లేదని, కాబట్టే పోరాటం చేయగలుతున్నానని చెప్పారు. భారతీయ మానవత్వంతో కుల మతాలకు అతీతంగా యువ వైద్యులు పని చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

READ MORE .....

కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు : డిప్యూటీ సీఎం

Next Story