కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు : డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-10 10:56:52  IST  )

ఆద్యంతం ఆకట్టుకుంటున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం.

కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు : డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : పిఠాపురంలోని ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్ కళాశాల మైదానంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు (Peethikapura Sankranthi Mahotsavalu) కన్నుల పండువగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, కళా ఖండాలను, సాంస్కృతిక ప్రదర్శనలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఉత్సవాలను విజయవంతం చేయడంలో కీలక భూమికను పోషిస్తున్న కళాకారులను ఎక్స్ వేదికగా పేరుపేరునా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. తెలుగువారికే ప్రత్యేకమైన సంప్రదాయ జానపద, శాస్త్రీయ నృత్యకళారూపాలతో వారు సందర్శకులను, వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారని కొనియాడారు.

సత్యసాయి జిల్లాకు చెందిన ఉరుములు కళారూపాన్ని ముందుండి నడిపించిన ఎస్. వరప్రసాద్, కర్నూలు జిల్లా నుంచి గురువయయాలు కళారూపంతో అలరించిన జె. మల్లికార్జున, లంబాడీ నృత్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జి.సునీత, కృష్ణా జిల్లా సంప్రదాయమైన డప్పులు కళారూపాన్ని ఘనంగా ప్రదర్శించిన వి.రాజీవ్ బాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన తప్పేటగుళ్లు ద్వారా జానపద వైభవాన్ని చాటిన కె. మల్లేశ్వర రావులకు ధన్యవాదాలను తెలియజేశారు.

విజయనగరం జిల్లా సంప్రదాయ పులివేషాలతో సంబరాన్ని రెట్టింపు చేసిన కె. అప్పారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా – అరకు లోయ ప్రాంతానికి చెందిన ధింస నృత్యంతో ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించిన పొద్దు అర్జున్, కృష్ణా–గోదావరి ప్రాంతంకు చెందిన కోలాటం కళారూపంతో మహిళా శక్తిని చాటిన అంజలి, విజయనగరం జిల్లా రేలారే రేలా జానపద గీతాలతో మధురానుభూతిని కలిగించిన టి. రవిప్రసాద్, పోలవరం ప్రాంతంకు చెందిన కొమ్ముకొయ్య కళారూపాన్ని సమర్థంగా ప్రదర్శించిన బృందాన్ని అభినందించారు.

,కోనసీమకు చెందిన సంప్రదాయ గరగలు కళారూపంతో సంప్రదాయాన్ని నిలిపిన రాజ్‌కుమార్, హరిదాసులు – గంగిరెద్దు కళారూపంతో భక్తి రసాన్ని నింపిన సతీష్, గారడి కళారూపాన్ని శక్తివంతంగా ప్రదర్శించిన సుబ్రహ్మణ్యం, కూచిపూడి, ఫోక్ డాన్స్, వోకల్ ప్రదర్శనలతో శాస్త్రీయ వైభవాన్ని చాటిన పి. శ్రీనివాస్ శర్మ, రఘుకులతిలక రామ లాంటి భక్తి భావ గీతాలతో హృదయాలను గెలిచిన కొండల స్వామి, కేరళ రాష్ట్రంకు చెందిన కలరిపయట్టు మార్షల్ ఆర్ట్‌తో రోమాంచిత క్షణాలు అందించిన విజయ్ కుమార్, సినీ సంగీత విభావరిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సత్య టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

మన కళలు, మన సంస్కృతి – ఇవే మన అసలైన సంపద అని తెలిపారు. ఇలాంటి కళారూపాలను కాపాడటం, ప్రోత్సహించడం మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

READ MORE .....

థాంక్యూ సార్.. డిప్యూటీ సీఎంకు చిన్నారుల షేక్ హ్యాండ్

Next Story