- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే : సీఎం చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలుగు ప్రజలు ఉండే ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలుగా ఏర్పాటై నేటి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడి దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ.. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్.. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలన్నారు. ప్రతీ తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలని, అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలని కాంక్షించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసి.. కీలక పాత్ర పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలని పిలుపునిచ్చారు.
TG: తగ్గని పవన్ కల్యాణ్.. ప్లాన్ చేంజ్: ఎక్స్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్
సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం.. మన తెలంగాణ : డిప్యూటీ సీఎం






