- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ బలం, బలగం కార్యకర్తలే : మంత్రి నారా లోకేశ్
టీం 11 కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు.

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ బలం.. బలగం కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ (Work Shop) లో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం ఎన్టీఆర్ (NTR) ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ.. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక్క తెలుగుదేశానికే సొంతం అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు వెళితే పత్రాలు లాక్కున్నా కూడా మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత తనకు స్ఫూర్తి అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రక్తమోడుతున్నా చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ లో తెగువ చూపిన మంజుల, విజయవాడలో వైసీపీ గూండాల దాడిలో కంటిచూపు కోల్పోయినా జై తెలుగుదేశం అని నినదించిన చెన్నుపాటి గాంధీ తనకు ఆదర్శమన్నారు. మెడపై కత్తిపెట్టి తమ నాయకుడి పేరు చెప్పమంటే.. జై చంద్రబాబు, జై టీడీపీ అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.త
బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్
దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే అని మంత్రి అన్నారు. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్ అని కొనియాడారు. 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తున్నారన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని నిత్యం ఆలోచించే వ్యక్తి సీఎం చంద్రబాబు అని స్పష్టం చేశారు. టీడీపీ నాయకుడు సంక్షేమం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే.. టీం 11 కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లని విమర్శించారు.
కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారు
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవనన్న కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామని, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలవరం పనులు పరిగెడుతున్నాయని, విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. రైల్వేజోన్ ఏర్పాటు చేసుకున్నామని చెబుతూ త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ (High Court Bench) తీసుకువస్తాం అన్నారు. కేంద్ర సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు చేయలేమని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. అభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని స్పష్టం చేశారు.
మై టీడీపీ యాప్ వినియోగించాలి
పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నానని మంత్రి లోకేశ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పనిచేసే వారిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. మై టీడీపీ యాప్ (MY TDP APP) ను అందరూ వినియోగించాలని.. యాప్ ద్వారానే పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.
READ MORE ....






