ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బంద్?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-27 10:52:45  IST  )

సోషల్ మీడియా వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందనేందుకు రోజూ మనం చూసే సంఘటనలే ఉదాహరణ.

ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బంద్?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందనేందుకు రోజూ మనం చూసే సంఘటనలే ఉదాహరణ. అడల్ట్ కంటెంట్ కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ లో వాటిపై బ్యాన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో మైనర్లు సోషల్ మీడియా వాడకుండా ఇప్పటికే కొన్నిదేశాలు నిషేధం విధించాయి. తాజాగా ఏపీలో కూడా పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

గతవారం దావోస్ పర్యటనకు వెళ్లిన ఐటీ శాఖమంత్రి నారా లోకేష్.. దీనిపై తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించేలా.. ఆరోగ్యం, భద్రత కోసం ఆస్ట్రేలియా అమలు చేస్తోన్న అండర్ - 16 చట్టంపై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధన రాష్ట్రంలో అమలైతే.. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్స్ వాడకంపై కఠిన ఆంక్షలు అమలయ్యే ఛాన్సుంది. నిబంధనలు పాటించని టెక్ సంస్థలపై భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

READ MORE ....

టీడీపీ బలం, బలగం కార్యకర్తలే : మంత్రి నారా లోకేశ్

Next Story