ప్రజల్లోకి టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ స్కీమ్స్

by Disha Web Desk |
ప్రజల్లోకి టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ స్కీమ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో ఆరు హామీలను ప్రకటించారు. ఈ భవిష్యత్‌కు గ్యారంటీ స్కీమ్స్‌పై రాజకీయ దుమారం కొనసాగుతుంది. అది కర్ణాటక మేనిఫెస్టోను కాపీ కొట్టారని సీఎం వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమ పథకాలను సైతం కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. టీడీపీ సైతం దమ్ముంటే తమకంటే మెరుగైన మేనిఫెస్టోను ప్రకటించాలని వైసీపీకి సవాల్ విసురుతోంది. తమ మేనిఫెస్టోను చూసి వైసీపీ నేతల వెన్నులో వణకుపుడుతుందని ధ్వజమెత్తుతుంది. ఇలాంటి తరుణంలో మినీ మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవాలని టీడీపీ భావిస్తోంది.

ఇందులో భాగంగా మినీ మేనిఫెస్టోను 150 రోజులపాటు ప్రతీ నియోజకవర్గంలో గడప గడపకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 10న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించడమే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ ముఖ్యోద్దేశంగా నేతలు, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు సన్నద్ధం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more:

ఏపీలో నెక్ట్స్ సీఎం ఆయననే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed