- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mumtaz Hotel : తిరుమలలో స్వాముల నిరసన దీక్ష..ముంతాజ్ హోటల్ రద్ధుకు డిమాండ్
తిరుమల తిరుపతిలో ముంతాజ్ హోటల్(Mumtaz Hotel) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాల(Construction Stopped)ని డిమాండ్ చేస్తూ హిందూ స్వాము(Hindu Swamis)లు నిరసన దీక్షల(Protest hunger strikes)కు దిగడం సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతిలో ముంతాజ్ హోటల్(Mumtaz Hotel) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాల(Construction Stopped)ని డిమాండ్ చేస్తూ హిందూ స్వాము(Hindu Swamis)లు నిరసన దీక్షల(Protest hunger strikes)కు దిగడం సంచలనంగా మారింది. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణానికి స్థల కేటాయింపు రద్ధు చేసుకోవాలని, నిర్మాణం నిలిపివేయాలని శ్రీనివాసానంద సరస్వతిస్వామి(Srinivasananda Saraswati Swami) ఆధ్వర్యంలో స్వాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
హోటల్ నిర్మాణం వెంటనే ఆపాలని టీటీడీ పరిపాలన భవనం ముందు స్వాములు దీక్ష చేపట్టారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం.. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఎక్కడ..అంటూ ఫ్లకార్డ్సు ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ తిరుమల ప్రక్షాళణ వల్లే వేసే సీఎం చంద్రబాబు, సనాతన ధర్మ పరిరక్షణ..ఆలయాల సందర్శన అంటూ హడావుడి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు ఏ మాత్రం హిందూ ధర్మ పరిక్షణ పట్ల, తిరుమల పవిత్రత పట్ల చిత్తశుద్ధి ఉన్నా ముంతాజ్ హోటల్ నిర్మాణం నిలిపివేయించాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం హిందూ సమాజాన్ని మోసం చేసిందని..తిరుమల కొండలను కళంకం చేసేలా అన్యమతానికి చెందిన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతివ్వడం దారుణమన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో హిందువుల తిరుమల కొండను కూటమి ప్రభుత్వం అపవిత్రం చేస్తుందని విమర్శించారు. ఇదే రకంగా జెరుసలెం, మక్కాలో చేయగలరా అని ప్రశ్నించారు. శేషాద్రి పర్వతం అంచునా..అన్నమయ్య సహా ఎంతో మంది రుషులు తపస్సు చేసిన చోట ముంతాజ్ హోటల్ కు అనుమతినివ్వడం హిందువులను మోసం చేయడమేనని..తక్షణమే కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించి అనుమతులు రద్ధు చేయాలని డిమాండ్ చేశారు. వారాహి డిక్లరేషన్ చేసి.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం డిమాండ్ చేస్తున్న పవన్ కల్యాణ్ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
Read More : Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన షురూ.. ప్రధాన వ్యూహం అదేనా!






