- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన షురూ.. ప్రధాన వ్యూహం అదేనా!

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు బయలుదేరారు. ఇవాళ ఉదయం ఆయన ఆగస్త్య మహర్షి ఆలయాన్ని (Agastya Maharshi Temple) విజిట్ చేసేందుకు కొచ్చి విమానాశ్రయానికి (Kochi Airport) చేరుకున్నారు. మూడు రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆయా ఆలయాల్లో భక్తులకు వసతులు, మౌలిక వసతుల కల్పనపై అక్కడి అధికారులతో భేటీ కానున్నారు. అయితే, పవన్ ఆలయాల సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. సనాతన ధర్మ (Sanathan Dharma) పరిరక్షణ, బీజేపీ (BJP) తరఫున హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారనే చర్చ రాష్ట్రంలో మొదలైంది.
కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ (NDA) తరుపున సత్తా చాటాలని జనసేన చీఫ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ వారాహి దీక్ష చేపట్టారు. అనంతరం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం వేళ ప్రాయశ్చిత్త దీక్షకు సైతం దిగారు. అప్పట్లో సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. సనాతన ధర్మ (Sanathan Dharma) పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అందుకు దేశ వ్యాప్తంగా అటు సోషల్ మీడియా (Social Media)లో.. ఇటు రాజకీయంగా ఆయన భారీగా మద్దతు లభించింది. పవన్ తాజా పర్యటన ఆలయాల సందర్శన కోసమే అయినా.. ఈ పర్యటనలో బీజేపీ ప్లాన్ ఉందని పొలిటికల్ అనలిస్ట్‌లు (Political Analysts) అభిప్రాయపడుతున్నారు.