- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులవర్ధన్ ది ఆత్మహత్యేనా? : వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్
మదనపల్లెలో బాలిక హత్యాచారం, నిందితుడి మృతి రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ ఘటనలపై ఎస్పీ ధీరజ్ వివరణ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: మదనపల్లె మండలం నీరుగట్టువారపల్లిలో హత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. ఈ కేసులో కీలక నిందితుడైన కులవర్ధన్ చెరువులో శవమై కనిపించడం మరో కలకలానికి దారితీసింది. తాజాగా ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. కులవర్ధన్ ఇంటి తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూసినపుడు ముద్దాయి ఇంటిలోనే ఉన్నాడని, ఆ పక్కనే ఉన్న నీళ్ల డ్రమ్ములో పాప మృతదేహం కనిపించిందని తెలిపారు. అప్పటికే ఆ ఇంటి చుట్టూ 50 మంది వరకూ గ్రామస్తులు గుమిగూడి ఉన్నారని, కులవర్ధన్ ఇంటిలో పాప మృతదేహం దొరకగానే.. అతడిని చంపేందుకు ప్రయత్నించారన్నారు. వారందరినీ పోలీసులే అడ్డుకుని కులవర్ధన్ ను ఒక వెహికల్ లో ఉంచామన్నారు. ముద్దాయితో డ్రైవర్ ఒక్కడే ఉండటంతో కురబలకోట మండలం కనసానివారిపల్లె ప్రాంతంలో అతను తప్పించుకుని పారిపోయినట్లు తెలిపారు. కులవర్ధన్ ను వెతికి పట్టుకునేందుకు రెండు టీమ్స్ గాలించినా ఆచూకీ దొరకలేదన్నారు. అదే ప్రాంతంలో ఉన్న చెరువులో ఈరోజు ఉదయం కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించామని, అతని మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇప్పటి వరకూ అతని మృతదేహం కోసం ఎవ్వరూ రాలేదని తెలిపారు. అతనిది ఆత్మహత్యేనని ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అతని తల్లి కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
కాగా.. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు కులవర్ధన్ మృతదేహాన్ని తమకు చూపించాలని, అప్పుడే తమకు న్యాయం జరిగిందని నమ్ముతామంటున్నారు. తమ కూతురి మరణం వెనుక కులవర్ధన్ తో పాటు అతని తల్లి, మరికొందరు వ్యక్తులు కూడా సహకరించాలని ఆరోపిస్తున్నారు. బాలికపై దారుణం జరుగుతున్న సమయంలో అతని తల్లి కూడా ఇంట్లోనే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటిపై పోలీసులు స్పందించలేదు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే.. కులవర్ధన్ కు ఎవరైనా సహకరించారా? అన్నదానిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.






