- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయికి అలవాటు పడే కులవర్థన్ ఈ ఘాతుకం: హోంమంత్రి అనిత
గంజాయికి అలవాటుపడి కులవర్ధన్ బాలికపై ఘాతుకానికి పాల్పడ్డారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: గంజాయి(Marijuana)కి అలవాటుపడి కులవర్ధన్ బాలికపై ఘాతుకానికి పాల్పడ్డారని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) తెలిపారు. మదనపల్లి ఘటనపై ఆమె స్పందించారు. బాలికపై పాల్పడిన దారుణానికి కులవర్ధన్ మనస్థాపం చెందారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. మదనపల్లె మండల నీరుగట్టువారపల్లిలో హత్యాచారణాకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు కీలక నిందితుడు కురవర్థన్ చెరువులో దూకి ఆత్మహత్ చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తీసుకెళ్తున్న సమయంలో తప్పించుకున్నారు. అనంతరం చెరువులో మృతదేహం లభ్యమైంది. అయితే బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహాన్ని తన ఇంట్లోని నీళ్ల డబ్బులో ఉంచారు. అనంతరం ఇంటి గడి పెట్టుకుని నిందితుడు అలానే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడి ఇంటిపై బాలిక కుటుంబసభ్యులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా నిందితుడు తప్పించుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు హోంమంత్రి అనిత స్పందించారు.






