- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సభకు అధికారులు గైర్హాజరు.. జిల్లా కలెక్టరుకు కీలక ఆదేశాలు
సీఎం చంద్రబాబు నాయుడు సభకు కొందరు అధికారులు హాజరు కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి కొందరు అధికారులు గైర్హాజరైనట్లు గుర్తించారు. జిల్లాలో నిర్వహించిన ‘సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమానికి రాని కొందరు అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రధానంగా నీటిపారుదల (Irrigation), రెవెన్యూ, వ్యవసాయ శాఖకు చెందిన కొందరు క్షేత్రస్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీరు విధుల్లో నిర్లక్ష్యం వహించారా లేక సమాచారం అందలేదా అనే కోణంలో విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ను సీఎం ఆదేశించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల పునరుద్ధరణను ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టింది. సాగునీటి సంఘాల బాధ్యతలపై అవగాహన కల్పించే సభలో సంబంధిత అధికారులు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో సందేశం సరిగా వెళ్లదని సీఎం భావించారు. అందుకే అధికారుల గైర్హాజరుపై ఆయన తీవ్రంగా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.






