- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్‌లోపు మారండి.. లేదంటే వేటే: కుప్పం నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్
కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: కుప్పం నియోజకవర్గం(Kuppam Constituency)లోని తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నేతల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇంకా కొనసాగుతున్న వర్గ రాజకీయాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేతలందరూ విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆదేశించారు. ప్రధానంగా సీనియర్ నేతలు తమ నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. అలాగే కింది స్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతానికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.
అన్ని గమనిస్తున్నాం
నేతల పని తీరును నిశితంగా గమనిస్తున్నానని, వైఖరి మార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. జూన్ నెలలోపు నేతల తీరులో స్పష్టమైన మార్పు రావాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.
అస్సలు ఒప్పుకునేదేలేదు..
కుప్పం అంటే తన సొంత గడ్డ అని, అక్కడ క్రమశిక్షణారాహిత్యాన్ని సహించమని చంద్రబాబు హెచ్చరించారు. స్థానిక నేతలు గ్రూపులుగా విడిపోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా నేతలు తమ మధ్య ఉన్న బేధాభిప్రాయాలను పరిష్కరించుకుని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.






