- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మరో ప్రమాదం...కావేరీ ట్రావెల్స్ బస్సులో పొగలు !
నరసాపురం నుంచి భీమవరం మీదుగా హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. నరసాపురం నుంచి భీమవరం మీదుగా హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. అయితే బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే రవాణా అధికారులకు సమాచారం కూడా అందించారు ప్రయాణికులు, స్థానికులు.
బస్సులో పొగలు..ప్రయాణికులు సేఫ్
దీంతో రంగంలోకి దిగిన అధికారులు...బస్సు ఇంజన్ పరిశీలించారు. ఇంజన్ బెల్ట్ రాపిడికి పొగలు వచ్చాయని నిర్ధారణకు వచ్చారట అధికారులు. ఆ సమయంలో బస్సులో మొత్తం 16 మంది మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ ప్రయాణికులు మాత్రం ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. వేరే బస్సు ఏర్పాటు చేస్తేనే వెళ్తామని ప్రయాణికులు నిరసన తెలిపారు. దీంతో నిన్న అర్ధరాత్రి మరొక బస్సును ట్రావెల్స్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
Read More..






