మరో ఘోర బస్సు ప్రమాదం.. కాలి బూడిదైన ముగ్గురు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-22 03:19:23  IST  )

ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

మరో ఘోర బస్సు ప్రమాదం.. కాలి బూడిదైన ముగ్గురు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ఈ ప్రమాదానికి గురైంది. బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ వెంటనే బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కిటికీల్లోంచి దూకేయడంతో పదిమందికిపైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వీరిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More..

నంద్యాల బస్సు ఘటన.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీల‌క ఆదేశాలు

Next Story