నంద్యాల బస్సు ఘటన.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీల‌క ఆదేశాలు

by velandi.Saikiran |   (  Updated:2026-01-22 03:18:26  IST  )

నంద్యాల బస్సు ప్రమాద ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు.

నంద్యాల బస్సు ఘటన.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీల‌క ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నంద్యాల బస్సు ప్రమాద ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో క్ష‌త‌గాత్రుల‌కు చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంద‌ని, వారి వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు వివ‌రించారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాగా, నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సిరివెళ్ల మెట్ట దగ్గర ప్రైవేట్ బస్సు, కంటైనర్ ఢీ కొట్టుకున్నాయి. దీంతో మంటలు చెలరేగగా, ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంద‌ని అంటున్నారు. మంటల్లో పడి బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ మృతి చెందారు. అటు ప్రయాణికులను బస్సు క్లీనర్ కాపాడినట్లు స‌మాచారం అందుతోంది. టైర్ పంక్చర్ కావడంతో బస్ అదుపుతప్పింద‌ని అంటున్నారు. దీంతో డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింద‌ట‌ ట్రావెల్స్ బస్సు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది.

Read More..

మరో ఘోర బస్సు ప్రమాదం.. కాలి బూడిదైన ముగ్గురు

Next Story