- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై భూమన సంచలన ఆరోపణలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ పూర్తి విచారణ అనంతరం రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయన స్పందించారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్‌గా మారిందన్నారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ(Tirumala laddu adulteration) వ్యవహారంపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్( single member commission)పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ పూర్తి విచారణ అనంతరం రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగడంతో ఆయన స్పందించారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్‌గా మారిందన్నారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చెప్పిందే కమిషన్ చేస్తోందని చెప్పారు. ఏకసభ్య కమిషన్‌కు నేతృత్వం వహించిన దినేశ్ కుమార్‌ను చంద్రబాబు ప్రలోభపెట్టారని ఆరోపించారు. దినేశ్ కుమార్ పక్కా అవినీతి అధికారని విమర్శించారు. అసలు అనిల్ సింఘాల్, ధర్మారెడ్డిని విచారించారా అని ప్రశ్నించారు. దినేశ్ కుమార్ తన పరిధి పని చేశారని వ్యాఖ్యానించారు. అసలు వ్యక్తులపై చర్యలు లేవని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. దినేశ్ కుమార్ కు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే చంద్రబాబు చెప్పినట్లు రిపోర్టు ఇచ్చారని భూమన తెలిపారు.






