శ్రీవారి లడ్డూ అపవిత్రం వెనుక ఆ ముగ్గురే: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-03 10:40:37  IST  )

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

శ్రీవారి లడ్డూ అపవిత్రం వెనుక ఆ ముగ్గురే: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Srivari Laddu Prasadam) తయారీలో కల్తీ నెయ్యి(Adulterated ghee) వాడకంపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్(Jana Sena leader Kiran Royal) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలే ఈ మహాపాపానికి ప్రధాన సూత్రధారులని ఆయన ధ్వజమెత్తారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన వారు నేడు ఏమీ ఎరగనట్లు బయట దొరల్లా తిరుగుతున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

డబ్బుపై కక్కుర్తితోనే..

కేవలం డబ్బుపై ఉన్న కక్కుర్తితోనే నాణ్యత లేని నెయ్యిని కొనుగోలు చేస్తూ, శ్రీవారి పవిత్రతను ఈ ముగ్గురు నేతలు దెబ్బతీశారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌ను తక్కువ చేసి చూసిన వీరికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక ఉన్న అసలు దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

Next Story