- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. మహానాడు వేదికగా లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ సంచలన ప్రకటన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేస్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించాక ఇవాళ మహానాడు -2026 వేదికపై తొలిసారి పార్టీని ఉద్దేశించి మాట్లాడిన లోకేశ్.. మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అయితే మహానాడు వేదికగా ఇవాళ మధ్యాహ్నం బిగ్ అనౌన్స్ మెట్ ఉంటుందంని ఈ ఉదయం ఎక్స్ వేదికగా లోకేశ్ ఓ పోస్టు పెట్టారు. దీంతో లోకేశ్ ఏం ప్రకటన చేయబోతున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన రాజకీయాల్లో మహిళకు మరింత ప్రాధాన్యత, ప్రోత్సాహం కల్పించబోతున్నట్లు ప్రటన చేశారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అంకురార్పణగా మారనుంది.
వైఎస్ జగన్‍కు చాలెంజ్:
మహానాడు వేదికగా మాట్లాడిన లోకేశ్.. 2019-2024 మధ్య కాలంలో టీడీపీ కార్యకర్తలు గడ్డుకాలం ఎదుర్కొన్నారన్నారు. శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఏకంగా నాపైనే 23 కేసులు పెట్టి వేధించారు. అయినా మాట తప్పం, మడమ తిప్పమని ఆనాడే చెప్పాం చెప్పినట్లే ముందడుగు వేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమం వెంట పరుగులు పెట్టడం వల్ల గత ప్రభుత్వం చేసిన అరాచాకాలు, దాడులను మరిచిపోయామని, గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధికి మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీరు సిద్ధమా అని వైఎస్ జగన్ కు చాలెంజ్ చేశారు. డేట్ టైమ్ మీరే నిర్ణయించాలన్నారు. హైబ్రిడ్ విధానం అనగానే టీమ్ 11 ఎగతాళి చేసిందని ప్రధాని మోడీ పిలుపుతోనే హైబ్రిడ్ మోడల్‍లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ముందు ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మాదేననన్నారు. ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా మాహానాడు గొప్ప పండగ అన్నారు. మహానాడు అంటే మాస్ జాతర అన్నారు.
పార్టీలో కార్యకర్తే అధినేత:
తెలుగుదేశం పార్టీలో కార్యక్తే అధినేత అని తెలుగువారి ఆత్మగౌరవం, పౌరుషం ఎన్టీఆర్ అని లోకేశ్ చెప్పారు. శ్త్రీశక్తిని ముందుగా గుర్తించినంది ఎన్టీఆర్ అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సీబీఎన్ అనే మాట వినిపిస్తుందని చంద్రబాబులో 25 ఏళ్ల యువకులు ముగ్గురు ఉన్నారని ఆయన ఇప్పటికీ జెడ్ స్పీడ్ తో పని చేస్తున్నారని చెప్పారు. నేషన్ ఫస్ట్ అనేది టీడీపీ నినాదం అన్నారు. వైనాట్ 175 అన్న వాళ్లకు చివరకు ప్రజలు టీమ్ 11 ఇచ్చారని 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చింది. మాది గూగుల్.. మీద గొడ్డలి. మాది పైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్.మాది కియా అయితే మీది కిడ్నాప్. చంద్రబాబు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు. టీడీపీ సిద్ధాంతాలే మన బలం అని రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అది సీబీఎన్ అన్నారు.






