‘రాజకీయాల్లో కొత్త చరిత్ర’ అంటూ లోకేష్‌పై ప్రశంసల వర్షం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-27 08:49:26  IST  )

మహానాడులో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన చారిత్రాత్మకమని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేయడం సాధారణ విషయం కాదని ఆయన తెలిపారు...

‘రాజకీయాల్లో కొత్త చరిత్ర’ అంటూ లోకేష్‌పై ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్ డెస్క: మహానాడు(Mahanadu)లో మంత్రి నారా లోకేష్(Minsiter Nara Lokesh)చేసిన ప్రకటన చారిత్రాత్మకమని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchnnaidu) ప్రశంసించారు. రాజకీయాల్లో మహిళల(Women)కు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేయడం సాధారణ విషయం కాదని ఆయన తెలిపారు. అది మహిళల సాధికారతపై ఉన్న నిజమైన నిబద్ధతకు నిదర్శనం అని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. దేశంలో ఎంతో మంది నాయకులు మహిళలపై మాట్లాడతారని, కానీ ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకునే దమ్ము, సంకల్పం ఉన్న నాయకుడు మంత్రి లోకేష్ అని గర్వంగా చెబుతున్నానని మంత్రి అచెన్నాయుడు తెలిపారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నా బిల్లు పాస్ అయినా కాకపోయినా తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించడం ఆయన గొప్ప నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

రాజకీయంగా సమాన అవకాశాలు..

మహిళల పట్ల గౌరవం, వారికి రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయనలో ఎంత బలంగా ఉందో ఈ నిర్ణయం చెబుతోందని అచ్చెన్నాయుడు అన్నారు. నాయకుడు అంటే పదవి కాదు… సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తి అని చెప్పారు. ఆ లక్షణాలు మంత్రి లోకేష్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని, మహిళల గౌరవం కోసం, వారి భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. యువ నాయకత్వం అంటే ఏమిటో, మహిళల పట్ల నిబద్ధత ఎలా ఉండాలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు యువ‌నాయ‌కులు మంత్రి లోకేష్ నాయకత్వంలో ఆ సంకల్పం మరింత బలపడిందని, భవిష్యత్తులో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ఇది గొప్ప ముందడుగు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. మహానాడు వేదికగా లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే

Next Story