ఇదేనా మీ "రూల్ ఆఫ్ లా"... రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by velandi.Saikiran |   (  Updated:2026-02-02 11:50:47  IST  )

జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడుల వివరాలను తన పోస్టులో వివరించారు.

ఇదేనా మీ రూల్ ఆఫ్ లా... రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి రోజా సంచలన పోస్ట్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలో వైసీపీ నాయకులపై దారుణంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇంటిపై ఇటీవల దాడి చేసిన టీడీపీ పార్టీ నేతలు, లేటెస్ట్ గా జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడుల వివరాలను తన పోస్టులో వివరించారు.

చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత సాక్షి ఆఫీస్, డెక్కన్ క్రానికల్ కార్యాలయాల పైన కూడా దాడులు జరగడం అత్యంత బాధాకరమని ఎమోషనల్ అయ్యారు. రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా అంటూ చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ విమర్శలు చేశారు రోజా. ఏపీలో ప్రతిపక్ష నాయకులు ఉండకూడదా ? ప్రశ్నిస్తే ఇలా దాడులు చేస్తారా ? అని నిప్పులు జరిగారు రోజా. దీంతో రోజా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. సీఎం చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ ఇంటిపై కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఏపీ రావణ కాస్టగా మారిపోయింది.

టీడీపీ అధికారంలో వైసీపీ నాయకులపై దాడులు! వివరాలు ఇవే : మాజీ మంత్రి

Next Story